ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

10, డిసెంబర్ 2010, శుక్రవారం

మనసు గుఱ్ర్ర్రమురోరి మనిసీ!!!

నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఏదో యాదలాపంగా రాగం తీస్తూ పాడుతున్నారు....తీరా వింటే అప్పుడెప్పుడో నేను చదివిన గురువుగారి తత్త్వపు పాటలు.."చెలియలికట్ట"లోవి..నాకు ఎంత ఇష్టమో ఈ పాటలు....చిన్నప్పుడు తోచిన రాగం కట్టుకుని పాడుకుంటుండే వాణ్ణి....చక్కటి పల్లె పదాలతో గురువుగారు అల్లిన తీరు...అద్భుతం......జీవితపు సారాన్నంతటినీ ఆ బైరాగి గొంతులో పలికిస్తారు.......మచ్చుకు కొన్ని మీకు పరిచయం చేస్తున్నాను....విజ్ఞులు, సంగీత సరస్వతులు ఎవరన్నా రాగంకట్టి పాడితే వినాలన్నది నా చిరకాలకోరిక...

మనసు గుఱ్ఱమురోరి మనిసీ
మనసు కళ్ళెము లాగు మనిసీ!

కళ్ళెమును వదిలితే కంచెలో బడద్రోయు
కళ్ళు తేలేస్తావు జనుడా! ఆ పైని
కార్యమేమున్నదిర జనుడా!

మనసు ఆగముదిరా మనిసీ!
మనసు బోగముదిరా మనిసీ!

రొక్కమంటే సరీ ప్రక్క చేరతదిరా
చిక్కిపోతవురోరి జనుడా! అద్దాని
టక్కులో పడతావు జనుడా! II మనసు గుఱ్ఱము II

ఈ పాటతో సముద్రం ఒడ్డున కథ మొదలవుతుంది.....మట్టి చిలుములో గంజాయి వేసుకుని, సముద్రం గాలికి తంటాలుపడి దాన్ని వెలిగించి,పీలుస్తూ..కళ్ళుతేలేస్తూ, నిషా ఎక్కిన కొద్దీ చేతిలో ఉన్న సొరకాయబుఱ్ఱ మీటుతూ ఈ పాట ఎత్తుకుంటాడు....

తర్వాత మధ్యలో కథ నడుస్తున్నపుడు ఆ సందర్భానికి తగ్గట్టు ఇంటి ముందు మళ్ళా ప్రత్యక్షమవుతాడు, మరో పాటతో.....


1 కామెంట్‌:

  1. ఈ విశ్వనాథ వారి ఊసుతో సంబంధం లేదు గానీ, కౌటిల్య - మీరు గుర్తొచ్చారు "http://puranapandaphani.wordpress.com/2012/03/04/%E0%B0%B2%E0%B1%87%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AE%E0%B0%BE%E0%B0%82%E0%B0%B8%E0%B0%82-%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8/' చదివినపుడు. మీ దగ్గర వివరణ దొరకొచ్చేమో అనుకున్నాను.

    రిప్లయితొలగించండి