ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

4, జనవరి 2010, సోమవారం

చదువుల తల్లి




తల్లీ ! నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్త్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!



ఇది మన తెలుగు వారి సరస్వతీ స్తోత్రం..మనకు చాలా సరస్వతీ స్తోత్రాలు తెలుసు.అన్నీదాదాపు సంస్కృతం లోనే.


పూర్వం మన తెలుగిళ్ళల్లో పిల్లవాడికి మొదట పుస్తకం పట్టించేప్పుడు ఈ పద్యం చెప్పేవాళ్ళు..ఇక రోజూ బళ్ళో మొదట పొత్తం తియ్యగానే ఈ పద్యం గాఠ్ఠిగా చదివి అప్పుడు మిగతా చదువు మొదలెట్టేవాళ్ళు....


మేం కూడా పొద్దున్నే పుస్తకం తీసే ముందు ఈ పద్యం స్పష్టంగా చదవాల్సిందే...బాగా గుర్తు..నాన్నగారు ఎదురుగా నుంచునేవారు(ఒక్కోసారి కఱ్ర కూడా పట్టుకునేవారనుకోండి).నేను,అన్నయ్య పోటీపడి,ఇంటికప్పు లేచిపోయేంత పెద్దగా చదివేవాళ్ళం...ఇలా చదివితే మాట స్పష్టంగా వస్తుందని,చదివింది బాగా బుఱ్రకెక్కుతుందని నాన్న చెప్పేవారు..ఇప్పటికీ నేను పొద్దున్నే పూజలో ఈ పద్యం చదవాల్సిందే....


ఇక గురువుగారి వ్యాఖ్యానానికొస్తే.....


ఉల్లము అంటే హృదయం అని అర్థం..బుద్ధ్హ్హ్హి అని కూడా......హృదయం,బుద్ద్హ్హి,మనసు ఈ మూడూ ఎప్పుడూ కలిసే ఉంటాయి....అందుకని అమ్మని అక్కడ నిల్చి ఉండి,ప్రతిమాటా ఒద్దికగా పలికింపమని కోరటం అన్నమాట.


ఉక్తుల్-మాటలు...
జృంభణముగా-విస్పష్టంగా,అంటే నాభి దగ్గర పుట్టిన శబ్దం పూర్తిగా గాలితో నిండి,ఎటువంటి వాక్కు దోషాలూ లేకుండా
వాగ్దోషాలు చాలా ఉన్నాయి...నంగి,నత్తి, నాలుక మందంగా ఉండి మాట ముద్దగా రావటం...అసలు గొంతులో శక్తి తక్కువై మాట సన్నగా రావటం...ఇలా

సుశబ్దమ్ము- అంటే ప్రతి శబ్దంలో అన్ని అక్షరాలూ,అవయవాలూ,ప్రత్యయాలూ ఖచ్చితంగా పలకాలి,,,అప్పుడే ఆర్థం సరిగ్గా వస్తుంది...లేకపోతే రాదు.(మన టీవి యాంకర్లు పెళ్ళిని పెల్లి అన్నట్టు)


జగన్మోహినీ- ఇక్కడ భావమేమిటంటే, వాణి అంటే మాట..కొంతమంది ఉపన్యాసం చెప్తుంటే సంగీతంలా ఉంటుంది...అర్థం,భావం చక్కగా తెలుస్తాయి. జనం మూగి వింటారు...అలా ఆకర్షించగలిగే మాటని ప్రసాదించమని ప్రార్థించడం...మనకి ఒక సామెత ఉంది.."నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది"


ఫుల్లాబ్జాక్షీ- ఫుల్ల అంటే వికసించిన అని అర్థం....వికసించిన తామర వంటి కన్నులు కలది అని శబ్దార్థం.....
లోతుకు వెళితే, అక్షి అంటే దూరంగా వ్యాపించునది అని అర్థం...అంటే వాక్కు చాలా దూరం వ్యాపిస్తుంది....కాలంలో,దూరంలో రెంటిలో కూడా,(ఆనాటి వేదాలు ఇప్పటికీ ఉన్నయి,అన్ని దేశాలకి వెళ్తున్నయి)అంటే మన వాక్కుకి కూడా అంతగా వ్యాపించే కీర్తిని ఇవ్వమని కోరుకోవటం......

పూర్ణేందుబింబాననా- పున్నమి చంద్రుని వంటి మోము కలదానా అని అర్థం.....గూఢార్థమేంటంటే, సంపూర్ణమైన ఆనందాన్ని ప్రసాదించమని..



ఈ పద్యాన్ని భావయుక్తంగా,రోజూ చదివితే వాగ్దోషాలన్నీ తొలగిపొయి,మంచి జ్ఞానం కలుగుతుందని నానుడి.

ఏవైనా తప్పులుంటే, మన్నించి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.

7 కామెంట్‌లు:

  1. గురుపూజతో,సరస్వతీ పూజతో మొదలుపెట్టావ్. ఇంక అడ్డులేకుండా సాగిపోండి.

    రిప్లయితొలగించండి
  2. బాగా ఆరంభించారు, విశ్వనాథవారి భావాల్ని,సాహిత్యాన్ని సరళం చేసి పదిమందికీ పంచే చిన్న ప్రయత్నం, ఆ పది మందిలో లో ఒక్కడిగా వేచిచూస్తుంటా ..

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు అశ్విన్..మీలాంటి సీనియర్స్ ప్రోత్సాహం ఉంటే రాస్తూనే ఉంటానండీ

    రిప్లయితొలగించండి
  4. ఈ తెలుగు శ్లోకాన్ని రాసింది ఎవరు?

    రిప్లయితొలగించండి
  5. ఇంకెవరండీ...ఆ పద్యంలో నుడికారం చూస్తే తెలుస్తోందిగా....మన పోతన్న గారే..

    రిప్లయితొలగించండి
  6. కౌటిల్య గారు మీలో ఇంత సాహిత్యం దాగి ఉందని నాకు ఇప్పటివరకు తెలియలేదు సుమండీ .. అధ్బుతం అండి. ఇక నుండి మీ బ్లాగు రెగ్యులర్ గా చదువుతానండి .

    రిప్లయితొలగించండి